Call Our Toll-Free Number: 123-444-5555

వేయిస్తంబాల గుడిలో మొదలైన రుద్రమదేవి

వేయిస్తంబాల గుడిలో మొదలైన రుద్రమదేవి                  

తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక భారీ సెట్ వేయించే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకనిర్మాతగా 3డిలో తెరకెక్కించనున్న సినిమా ‘ రుద్రమదేవి’. ఈ సినిమాలో టైటిల్ రోల్ ని యోగా బ్యూటీ అనుష్క పోషించనుంది, అలాగే మరో కీలక పాత్రని రానా దగ్గుబాటి పోషించనున్నాడు. కాకతీయుల కథ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఈ రోజు వరంగల్లోని వేయిస్తంభాల గుడిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అనుష్క, రానా, గుణశేఖర్ హాజరయ్యారు. మొదటి సన్నివేశానికి గుణశేఖర్ క్లాప్ నిచ్చారు.

గత రెండు నెలలుగా పలు లోకేషన్స్ లో 3డి ఫార్మాట్ కోసం సాంపిల్స్ కొన్ని షూట్ చేసారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కాగా, అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాని ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.

0 comments:

tutorilas

Blogger Widgets Blogspot Tutorial

About

Link List

Contact Details