Call Our Toll-Free Number: 123-444-5555

ప్రభాస్ కోసం 6 స్టోరీలపై పనిచేసిన రాజమౌళి.!

ప్రభాస్ కోసం 6 స్టోరీలపై పనిచేసిన రాజమౌళి.!

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శ కుడు ఎస్.ఎస్ రాజమౌళి తను తీయబోయే పీరియడ్ అడ్వెంచర్
సినిమా ‘బాహుబలి’ కోసం లొకేషన్ అన్వేషణలో భాగంగా ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్నారు. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అనుష్క, రానా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజమౌళి ప్రభాస్ తో చేయాలనుకున్న మొదటి ఛాయస్ ‘బాహుబలి’ కాదు.
ఇటీవల మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రభాస్ రివీల్ చేసారు. ‘మగధీర’ విడుదలకి ముందు నుంచే రాజమౌళి ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నారు. అప్పటి నుంచి రాజమౌళి ఆరు విభిన్న స్టొరీ లైన్స్ పై పనిచేసారు, చివరగా ‘బాహుబలి’ ఓకే అయ్యింది.
‘నాకు 6 స్టొరీ లైన్స్ నచ్చాయి. కానీ రాజమౌళి పర్ఫెక్షనిస్ట్. అయనకి నచ్చేంత వరకూ ఒక్కొక్క థీం పై వర్క్ చేస్తున్నాడు. చివరికి ‘బాహుబలి’ ఆయనకి నచ్చింది. నేను ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని’ ప్రభాస్ అన్నాడు. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

0 comments:

tutorilas

Blogger Widgets Blogspot Tutorial

About

Link List

Contact Details